రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. బిందు ఆకాష్ సమర్పణలో కోట ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. సుశాంత్ రెడ్డి కథను అందించగా…అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెకుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిమన్యు బద్ది మాట్లాడుతూ…‘హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల షూటింగ్‌తో సింగిల్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలో గోవాలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభిస్తాం. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. గోవా బ్యాక్ డ్రాప్లో జరిగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది’ అన్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : హరి గౌర, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి