దుబాయ్: దుబాయ్లో డ్రైవర్ రహిత ట్యాక్సీని ప్రారంభించారు. స్మార్ట్ మొబిలిటీ ఎకో సిస్టమ్లో భాగంగా తయారు చేసిన పూర్తి స్వయంప్రతిపత్తి గల ఆర్టీ6 ట్యాక్సీ వాహనాలను బైదూ అపోలో గో అభివృద్ధి చేసింది.
మదీనాత్ జమైకాలో జరిగిన ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్లో డ్రైవర్ లేని ఈ వాహనంలో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాస్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అవ మక్తూమ్ ప్రయాణించారు. త్వరలోనే ఈ సర్వీస్ ప్రజలకు అందుబాటులోకి రానున్నది.