Valmiki Ramayana | భారతీయ సంగీత శిఖరం, మాస్ట్రో ఇళయరాజా మరో అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. బాలీవుడ్ నుంచి ప్రతిష్టాత్మక ‘వాల్మీకి రామాయణం’ (Valmiki Ramayana) రాబోతుండగా ఈ చిత్రానికి ఆయన సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఇదొక ఆధ్యాత్మిక కలయిక.. సంగీతం ఇప్పుడు ఒక నైవేద్యం అంటూ చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
భావనా తల్వార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, వాల్మీకి మహర్షి రచించిన అసలు సిసలు రామాయణ ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించనుంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రానికి ఇళయరాజా తన సంగీతంతో ప్రాణం పోయనున్నారు. విజువల్స్ మరియు సంగీతం పరంగా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 2026 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
A spiritual alignment… #Ilaiyaraaja joins #ValmikiRamayana… Music, now an offering. pic.twitter.com/JI2iqGod9d
— taran adarsh (@taran_adarsh) April 19, 2026