మెదక్ అర్బన్, జూన్ 27: ప్రభుత్వం నుంచి బిల్లులు రాక గుండెపోటుతో ఓ కాంట్రాక్టర్ మృతి చెం దాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకున్నది. పట్టణంలోని బాలికల పాఠశాలలో ‘మనఊరు – మనబడి’లో భాగం గా కాంట్రాక్టర్ దశరథ్ (45) పనులు చేపట్టాడు. ఇందుకు సంబంధించి బిల్లులు చెల్లించాలని అధికారులను కోరాడు. సచివాలయం ఎదుట ధర్నా చేసినా ప్రభు త్వం నుంచి బిల్లులు రాలేదు.
బిల్లుల కోసం ధర్నా చేసిన దశరథ్పై హైదరాబాద్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేండ్లుగా బిల్లుల కోసం తిరుగుతున్నా డు. రూ.20 లక్షల వరకు బిల్లులకు రాక వడ్డీలు ఎక్కువ కావడంతో కొంతకాలంగా మానసికంగా కుంగిపోయాడు. శనివారం గుండెపోటుకు గురై మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దశరథ్కు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.