చిత్రంలో సైనిక దుస్తుల్లో కనిపిస్తున్న వృద్ధురాలి వయస్సు 98 ఏండ్లు. పేరు ఓలా. మాతృభూమిని కాపాడుకోవడానికి, రష్యాతో యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. ఆర్మీలో చేర్చుకోవాలని కోరారు. ఓలా మాజీ మిలిటరీ అధికారి. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. అయితే, ఓలా వయస్సు దృష్ట్యా ఆమె అభ్యర్థనను ఆర్మీ తిరస్కరించింది. ఈ యుద్ధంలో తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.