త్రిసూర్, ఏప్రిల్ 25: చిన్న పిల్లల చేతికి సెల్‌ఫోన్ ఇవ్వడం, ఫోన్ ఉంటేనే అన్నం తింటానని పిల్లలు మారాం చేయడం పరిపాటిగా మారింది. కానీ ఆ ఫోన్ ఎంత ప్రమాదకారో ఈ సంఘటనే ఓ ఉదాహరణ. కేరళకు చెందిన ఎనిమిదేండ్ల వయసున్న బాలిక చేతికి తల్లి సెల్‌ఫోన్ ఇచ్చింది. ఆ ఫోన్‌తో చిన్నారి ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలింది. ఆ సమయంలో ఫోన్ ముఖానికి దగ్గరగా ఉండటంతో తీవ్రగాయాలై మరణించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.