నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్పీఎస్) మదుపరులు ఇప్పుడు 60 ఏండ్లు వచ్చేదాకా ఈక్విటీల్లో 75 శాతం వరకు పెట్టుబడులను పెట్టుకోవచ్చు. ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) పెట్టుబడుల పరిమితిని పెంచింది. ఇంతకుముందు 51 ఏండ్లు దాటితే అసెట్ క్లాస్ ఈ (ఈక్విటీ)లో ఎన్పీఎస్ సబ్‌స్ర్కైబర్ల పెట్టుబడులు ఏటా 2.5 శాతానికి పడిపోయేవి. ఆపై ప్రభుత్వ సెక్యూరిటీల్లోకి పెట్టుబడులను మళ్లించేవారు. ఈ క్రమంలో మరో 9 ఏండ్ల వయో పరిమితినిస్తూ 60 ఏండ్లకు పీఎఫ్ఆర్డీఏ పొడిగించింది. ఎన్పీఎస్-ఆల్ సిటిజన్ మోడల్ కింద సబ్‌స్ర్కైబర్లు రిజిస్టర్డ్ పెన్షన్ ఫండ్స్‌లో దేన్నైనా ఎంచుకోవచ్చు. వాటిల్లో తమ పెట్టుబడులను క్రియాశీలకంగా పెట్టుకోవచ్చు.