హరిద్వార్: 70 ఏళ్ల మహిళ గంగా నదిలోకి ఓ బ్రిడ్జ్ మీద నుంచి దూకింది. ఆమె డుప్కీ కొట్టడం అక్కడున్న వారిని స్టన్ చేసింది. హరిద్వార్‌లోని హర్ కీ పురిలో ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి ఆ బామ్మ.. కింద ప్రవహిస్తున్న గంగలోకి జంప్ చేసింది. ఆ తర్వాత ఈజీగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బ్రిడ్జ్ మీద నుంచి దూకడమే కాకుండా తనదైన స్టయిల్లో పవిత్ర స్నానం చేసి యువతను ఆశ్చర్యపరిచింది. ఆ బామ్మ గంగలోకి దూకుతున్న సమయంలో అక్కడున్నవాళ్ల ఆమెకు చీర్స్ చెప్పారు. ఈ వీడియోను ఇప్పుడు అనేక మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.
अम्मा की छलांग .. 😳😳
हरकी पैड़ी के पुल से गंगा नदी में छलांग लगाने वाली बुजुर्ग महिला बुजर्ग महिला पुल से गंगा में छलांग लगाकर आराम से तैरकर किनारे जाती हुई विडियो में दिख रही है। बुजुर्ग महिला की उम्र 70 साल के करीब की बताई जा रही है। 😳😳#haridwar pic.twitter.com/IY9bDp7DAb
— Ashok Basoya (@ashokbasoya) June 28, 2022