అహ్మదాబాద్ : ఎయిరిండియా ఏఐ-171 విమానం కూలిపోయిన చోట దొరికిన విలువైన ఆభరణాలు, నగదును భద్రంగా పోలీసులకు అప్పగించిన రాజేశ్ పటేల్ నిజాయితీని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రమాద స్థలానికి సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న ఆయన మరికొందరితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
పొగలు కక్కుతున్న శిథిలాల్లో సుమారు 70 తులాల బంగారు ఆభరణాలు, 8 వెండి వస్తువులు, రూ.50 వేల నగదు, కొన్ని అమెరికన్ డాలర్లు తనకు దొరికాయని, వాటిని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారికి అప్పగించానని తెలిపారు. సంఘటన స్థలంలో దొరికిన వస్తువులను మృతుల బంధువులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు.