పాట్నా, ఏప్రిల్ 8: అందరూ చూస్తుండగానే పట్టపగలు దొంగల ముఠా 60 అడుగుల ఓ పాత ఇనుప బ్రిడ్జిని ఎత్తుకెళ్లింది. అది దొంగతనం అని తెలియక వారికి స్థానిక అధికారులు, గ్రామస్థులు కూడా సహకరించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన బీహార్‌లోని రొహతాస్ జిల్లాలో జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులమంటూ అక్కడికి చేరుకుని, గ్యాస్ కట్టర్లు, బుల్డోజర్ల సాయంతో మొదట బ్రిడ్జిని ముక్కలు చేశారు. ఆ ముక్కలను మూడు రోజుల పాటు తరలించారు. వాళ్లు దొంగలని తెలుసుకునేలోపే అక్కడి నుంచి ఉడాయించారు. ఈ బ్రిడ్జిని 1972లో అరా కెనాల్‌పై నిర్మించారు. శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని ప్రస్తుతం ఎవరూ వాడట్లేదు.