KTR | ప్రముఖ గాయని ఎస్.జానకి మృతి ఎంతో బాధాకరం..!
KTR : ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి(S Janaki) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విచారం వ్యక్తం చేశారు.
KTR : ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి(S Janaki) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విచారం వ్యక్తం చేశారు. తన మధురమైన గాత్రంతో నవరసాలు పండించగలిగే దిగ్గజ గాయని కన్నుమూసిందనే వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని ఎక్స్ పోస్ట్‌లో సంతాపం తెలిపారు కేటీఆర్. సుమారు ఆరు దశాబ్దాల పాటు, వివిధ భారతీయ భాషల్లో కొన్ని వేల పాటలు పాడి భారతీయులను అలరించారు జానకి. ఈ పోస్ట్‌లో జానకి బాల్యం సిరిసిల్లలో గడిచిన రోజులను గుర్తు చేసుకున్నారు.
‘మిమిక్రీ కళను జోడించి ఆహూతులను అలరిచిన వైవిధ్యమైన గాయని జానకి తన బాల్యంలో కొన్నేళ్లు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో నివాసం ఉన్నారు. జానకి మరణం సంగీత ప్రపంచానికి, భారతదేశ చలనచిత్ర రంగానికి తీరని లోటు. వారు భౌతికంగా మనకు దూరమైనా, వారి పాటలు సదా మనల్ని అలరిస్తూనే ఉంటాయి. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని కేటీఆర్ ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు.
ప్రముఖ గాయని ఎస్ జానకి గారి మరణవార్త ఎంతో బాధాకరం!
తన మధురమైన గాత్రంతో నవరసాలు పండించగలిగే దిగ్గజ గాయని ఎస్ జానకి గారు. సుమారు ఆరు దశాబ్దాల పాటు, వివిధ భారతీయ భాషల్లో కొన్ని వేల పాటలు పాడి భారతీయులను అలరించారు.
జానకి గారు తన బాల్యంలో కొన్నేళ్లు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న… pic.twitter.com/ecCMZLurRG
— KTR (@KTRBRS) July 11, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

