మహబూబ్‌నగర్ జిల్లా కాకర్లపహాడ్ నుంచి లింగంపల్లికి బొలేరో వాహనంలో తరలిస్తున్న యూరియాను రైతులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ఓ వ్యాపారికి చెందిన యూరియాను శనివారం వాహనంలో తరలిస్తుండగా.. స్థానిక యువకులు, రైతులు గమనించి నవాబ్‌పేటలో అడ్డగించారు. పోలీసులు వచ్చి 60 బస్తాల యూరియాను స్వాధీనం చేసుకొని వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు.
– నవాబ్‌పేట