హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన 40 అడుగుల పార్టీ జెండాను వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. 21 కిలోల కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ బాలరాజ్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు తలసాని సాయికిరణ్ యాదవ్, గుర్రం పవన్ కుమార్‌గౌడ్, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటాకుల చప్పుళ్లతో తెలంగాణ భవన్ వద్ద సందడి నెలకొన్నది.