హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఓ విప్ల వాత్మకమైన మార్పు. తెలంగాణ ప్రభుత్వం దీనికిప్పుడు పెద్దపీట వేసింది. రాష్ట్ర ఐటీ శాఖకు అను బంధంగా ఎమర్జింగ్ టెక్నాలజీ విభా గాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఏఐ, డ్రోన్ టెక్నా లజీలతో పలు కార్య క్రమాలను నిర్వహిం చిన రాష్ట్ర సర్కారు.. 3డీ ప్రింటింగ్-ఆడిటివ్ మ్యానుఫ్యా క్చరింగ్ టెక్నాలజీ కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్‌ను నెలకొల్పింది. కంప్యూటర్ ఆధారిత డిజైన్‌ను వాణిజ్యపరంగా రూపొందించి, 3డీ రూపంలో ప్రింటింగ్ చేసే అవకాశాన్ని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ కేంద్రం కీలకంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించిన వర్క్‌షాపులో 40కిపైగా స్టార్టప్‌లు, శిక్షణా సంస్థలు, 3డీ ప్రింటింగ్ ఉత్పత్తులను తయారుచేసే కంపెనీలు పాల్గొన్నాయి.