హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకలో మంగళవారం బావి రింగుల (ఓడలు) మధ్య ఇరుకుని ఓ యువకుడు 3 గంటలపాటు నరకయాతన అనుభవించాడు. గ్రామానికి చెందిన పోతుగంటి వెంకటేశ్ ఇంటి పకనున్న ఓడ బావికి మరమ్మతు చేసేందుకు మంగళవారం ముగ్గురు కూలీలతో పనులు చేపట్టారు. బావి ఓడల చుట్టూ మట్టిని తొలగిస్తుండగా, ఓడ కూలి మీద పడటంతో వెంకటేశ్ అందులోనే ఇరుక్కుపోయాడు. ఎటూ కదల్లేక, బయటకు రాలేక నరకయాతన పడ్డాడు. సర్పంచ్ రాజిరెడ్డి, ఎస్సై ప్రవీణ్ కుమార్ అక్కడికి చేరుకొని జేసీబీ సాయంతో మట్టి తొలగించి వెంకటేశ్‌ను కాపాడారు.