న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులోని 25 మంది జడ్జిలు, వారి సతీమణులు ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖపట్నం, అరకు అందాలను ఆస్వాదించబోతున్నారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన వీకెండ్ రిట్రీట్లో వీరు పాల్గొంటున్నారు. సంక్లిష్టమైన న్యాయస్థానాల వాతావరణం నుంచి కాస్త ఉపశమనం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని సీజేఐకి సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఈ కార్యక్రమంలో జడ్జిల పిల్లలు పాల్గొనబోరు.