ఇడుక్కి (కేరళ): ఆవు మాంసం తిన్నారన్న ఆరోపణలపై 24 మంది గిరిజనులను సామాజికంగా బహిష్కరించారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో చోటుచేసుకుంది. మరయూర్ అటవీ ప్రాంత సమీపంలో నివసించే గిరిజనుల్లో 24 మంది గో మాంసం తిన్నట్టు కుల పెద్దలకు తెలిసింది. దీంతో వెంటనే సమావేశమైన కుల పెద్దలు తమ సంప్రదాయానికి విరుద్ధంగా గో మాంసం తిన్నందుకు ఈ 24 మందిని సామాజికంగా బహిష్కరిస్తున్నట్టు తీర్మానించారు. ఈ తీర్మానం ప్రకారం కుటుంబసభ్యులుగానీ, ఎవరైనా సరే వీరిని కలువరాదు. ఈ విషయం తెలిసిన అధికారులు.. కుల పెద్దలకు నచ్చజెప్పడానికి యత్నిస్తున్నారు. పోలీసులు స్పందిస్తూ రాష్ట్రంలోని కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ఆవు మాంసం తినరాదన్న సంప్రదాయం కొనసాగుతున్నదని చెప్పారు.