కర్ణాటకలో 24 గంటల్లో.. ఆక్సిజన్ అందక 24 మంది మృతి
కర్ణాటకలో 24 గంటల్లో.. ఆక్సిజన్ అందక 24 మంది మృతి | దేశంలో ఆక్సిజన్ సంక్షోభం కొనసాగుతున్నది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందారు.

బెంగళూరు : దేశంలో ఆక్సిజన్ సంక్షోభం కొనసాగుతున్నది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందారు. తాజాగా 24 గంటల్లో కర్ణాటకలోని ప్రభుత్వ దవాఖానలో 24 మంది రోగులు మరణించారు. చామరాజనగర్ జిల్లా హాస్పిటల్లో రోగులు ఆక్సిజన్ కొరత, ఇతర కారణాలతో మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సురేష్‌కుమార్ తెలిపారు.
మరణాలపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. సంఘటనపై సీఎం యెడియూరప్ప విచారం వ్యక్తం చేశారు. అలాగే కలెక్టర్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో మంగళవారం అత్యవసర కేబినెట్ సమాశానికి పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. ఆదివారం 37,733 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇప్పటి వరకు 16లక్షల కేసులు రికార్డయ్యాయి. మరో 217 మంది చనిపోయాగా.. మొత్తం 16,011 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Tamilnadu Assembly Elections : పాత సంప్రదాయాన్నే ఫాలో అయిన తమిళులు
బీజేపీ హిందుత్వను హైజాక్ చేసిన మమత, స్టాలిన్, విజయన్
కమలానికి కర్రుకాల్చి వాత
కాంగ్రెస్ కథ ముగిసినట్టే!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

