హైదరాబాద్, ఆట ప్రతినిధి: బ్యాంకాక్(థాయ్లాండ్) వేదికగా ఈ నెల 31 నుంచి మొదలుకానున్న ఆసియా ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్నకు రాష్ర్టానికి చెందిన ఆదిత్య అవినాశ్, శివమణికంఠ, విష్ణువర్ధన్ ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న వీరు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఆసియా టోర్నీకి సన్నాహకంగా దక్షిణకొరియాలో జాతీయ ఐస్ స్కేటింగ్ సమాఖ్య ఏర్పాటు చేసిన శిక్షణాశిబిరంలో వీరు పాల్గొననున్నారు. గురువారం యువ స్కేటర్లు ఆదిత్య, మణికంఠ, విష్ణును సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అభినందించారు.