KCR | ఆలోచన, ఆచరణ అన్నీ భారీగానే!
- మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు
- పూర్తి కృష్ణశిలతో యాదాద్రి నిర్మాణం
- లక్షల కోట్ల మొక్కల పెంపకం
- రైతులందరికీ పెట్టుబడి, రైతు బీమా
CM KCR Birthday Special | అదేమన్నా అయ్యేదా పొయ్యేదా? ఎందుకయ్యా బంగారమసుంటి భవిష్యత్తు ఖరాబు చేసుకుంటావు. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవడం ఎందుకు చెప్పు. వదిలెయ్.. ఇదీ కేసీఆర్ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకునే ముందు అనేక మంది ఇచ్చిన సలహా. కానీ కేసీఆర్ వినలేదు. ఆయన అంతే.
“వాస్తవానికి ప్రతి పనీ రెండు సార్లు జరుగుతుంది. మొదటిసారి మన ఆలోచనలో, రెండోసారి మన ఆచరణలో!” ఇదీ కేసీఆర్ సిద్ధాంతం. నీ ఆలోచన ఎంత గరిమతో, ఎంత లోతుగా ఉంటుందన్నదాన్ని బట్టే ఆచరణలో దాని సాఫల్యత ఆధారపడి ఉంటుందని ఆయన భావిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన, ఇంటింటికీ మంచి నీళ్లు, 24 గంటల నిరంతర కరెంటు, మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు, పూర్తి కృష్ణశిలతో యాదాద్రి నిర్మాణం, కోట్లాది మొక్కల పెంపకం, రైతులందరికీ పెట్టుబడి సాయం, రైతు బీమా, దళితులందరికీ పది లక్షల రూపాయలు… ఇలా కేసీఆర్ చేపట్టిన ఏ పథకం చూసినా తలచుకుంటే భయమయ్యేంత పెద్దది! ఎంత పెద్దదీ అంటే గత ప్రభుత్వాలతో పోలిస్తే, అవి తమ పూర్తి పదవీకాలంలో, ఇందులో ఒక్కదాన్ని కూడా చేయలేకపోయేవి. కానీ ఏడేండ్లలో, ఏక కాలంలో, ఉన్న పరిమిత అధికార యంత్రాంగంతోనే అన్నీ పూర్తి చేయగలిగారు. కార్యక్రమం ఎంత పెద్దదన్నది కాదు; నీ ప్లానింగ్ ఎంత పకడ్బందీగా ఉందన్నదే కీలకం అంటారాయన. ఆయుధం కన్నా ఆశయం గొప్పది.
రాష్ట్రం ఏర్పడిన ఆరో నెల.. 2014 నవంబర్ 20 నాటి నుంచే ప్రజలకు కోతల్లేని విద్యుత్తును అందిస్తున్నాం. విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్ది నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నం. రాష్ట్రంలో ప్రస్తుతం జనరేటర్ల అవసరం చాలా వరకు తగ్గిపోయింది. రాష్ట్రంలో ఇన్వర్టర్లు పోయి, ఇన్వెస్టర్లు వచ్చే కాలం వచ్చింది.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
KCR Birthday Special | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
నాటికీ నేటికీ ఏకైక నాయకుడు కేసీఆర్
KCR | నిత్య విద్యార్థి.. నిరంతర అధ్యయనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

