న్యూఢిల్లీ: రెండేళ్ల వయస్సులో పిల్లలకు మాటలే సరిగా రావు.. కానీ ఓ చిన్నారి మాత్రం ప్రపంచంలోని 205 దేశాల రాజధానుల పేర్లను తడబడకుండా చెప్పేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..
ఈ వీడియోను ఐఏఎస్ అధికారి ప్రియాంక శుక్లా ట్విటర్లో షేర్ చేశారు. ‘ఈ చిన్నారి పేరు ప్రణీనా.. వయస్సు 2.6 ఏళ్లు.. నా సహోద్యోగి ప్రదీప్ కూతురు. ఆమె 205 దేశాల రాజధానుల పేర్లను తడబడకుండా చెప్పేయగలదు. ఆఫ్ఘనిస్తాన్, అర్మేనియా, బహ్రెయిన్, భూటాన్ నుంచి ఇజ్రాయెల్, చైనా, సైప్రస్, జపాన్ వరకు ఏ దేశం పేరు చెప్పినా దాని రాజధాని పేరును ఠక్కున చెప్పేస్తుంది.’ అని ప్రియాంక శుక్లా పేర్కొన్నారు. ప్రణీనాది అసాధారణ ప్రతిభ అని కొనియాడారు. కాగా, ఈ వీడియోను ఇప్పటివరకూ 25 వేలకు పైగా మంది వీక్షించగా..2 వేలకు పైగా లైక్లు వచ్చాయి.
आपको कितने देश की राजधानियों के नाम पता हैं?
— Priyanka Shukla (@PriyankaJShukla) June 1, 2021
इस वीडियो के माध्यम से मिलिए मेरे सहयोगी @23Pradeep की बिटिया प्रनिना से!
मात्र 2.6 वर्ष की उम्र में इन्हें 205 देशों की राजधानियों के नाम कंठस्थ हैं।
प्रदीप बताते हैं कि प्रनिना की याददाश्त प्रारम्भ से ही असाधारण है। pic.twitter.com/Zz7KViSqhy