ఎడ్మంటన్: కెనడాలోని ఎడ్మంటన్‌లో ఉన్న గురుద్వారా(Edmonton Gurdwara)లో ఓ వ్యక్తి దాడి చేశాడు. ఇద్దర్ని పొడిచేశాడు. స్క్రూడైవర్‌తో అతను అటాక్ చేశాడు. ఈ కేసులో 27 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితమే అతను జైలు నుంచి రిలీజైనట్లు గుర్తించారు. నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు ఎడ్మంటన్ పోలీసులు వెల్లడించారు. 2015 నుంచి అతను దాడులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఆల్బెర్టాలో ఉన్న జైలు నుంచి అతను రిలీజయ్యాడు. నానక్సర్ గురుద్వారా వద్ద దాడి జరిగింది. హైవే మీద నడుచుకుంటు వెళ్తున్న వ్యక్తి అకస్మాత్తుగా గురుద్వారాలోకి ప్రవేశించి దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. గురుద్వారలోని ప్రార్థన ప్రదేశాన్ని చేరుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. గురుద్వారాలో ఘర్షణ జరిగింది. ఆ సమయంలో ఇద్దరు గాయపడ్డారు. బాధితులు ఇద్దర్నీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏ ఉద్దేశంతో అటాక్ చేశాడో పోలీసులు ఇంకా వెల్లడించలేదు. గురుద్వారాలో జరిగిన దాడిని ప్రధాని మార్క్ కార్నే ఖండించారు.
The attack at the Nanaksar Gurdwara in Edmonton this morning is appalling. My thoughts are with the two people who were injured and the wider community that is shaken by this terrible event.
No one should ever feel unsafe in their place of worship. I want to thank the Edmonton…
— Mark Carney (@MarkJCarney) August 21, 2026