Flyover | ఫ్లైవోవర్‌పై నుంచి కిందపడ్డ బస్సు.. ఇద్దరు మృతి
Flyover | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్‌గఢ్ (Rajgarh) జిల్లాలోని పచోర్ టౌన్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఫ్లైవోవర్‌పై నుంచి కిందపడిపోయింది (Bus Falls From Flyover).
Flyover | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్‌గఢ్ (Rajgarh) జిల్లాలోని పచోర్ టౌన్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఫ్లైవోవర్‌పై నుంచి కిందపడిపోయింది (Bus Falls From Flyover). ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 40 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
బస్సు 55 మంది ప్రయాణికులతో ఇండోర్ నుంచి శివపురి జిల్లాలోని పిచోర్ పట్టణానికి (Pachore town) వెళ్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పచోర్ టౌన్ సమీపంలోని ఫ్లైవోవర్పైకి రాగానే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కిందకు పడిపోయినట్లు పచోర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆకాంక్ష శర్మ తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. సుమారు 40 మంది గాయపడ్డట్లు వెల్లడించారు.
క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడిన 19 మందిని ఇండోర్‌కు రిఫర్ చేయగా, మిగిలిన వారు షాజాపూర్, బియోరా, పచోర్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. మృతుల్లో ఒకరిని హర్జత్ సింగ్ (28)గా గుర్తించినట్లు చెప్పారు. ప్రమాదం తర్వాత ఘటనాస్థలం నుంచి పరారైన బస్సు డ్రైవర్, కండక్టర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
Also Read..
Prashant Kishor | బీజేపీకి 370 సీట్లు దాటకపోవచ్చు : ప్రశాంత్ కిషోర్
Anand Mahindra | 2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్ ఫొటో : ఆనంద్ మహీంద్రా
Flamingos | విమానం ఢీకొని 36 ఫ్లెమింగోలు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

