మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఇద్దరు అనుచరుల అరెస్ట్
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఇద్దరు అనుచరుల అరెస్ట్ | మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఇద్దరు వ్యక్తిగత సహాయకులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం అరెస్టు చేశారు.

ముంబై : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఇద్దరు వ్యక్తిగత సహాయకులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం అరెస్టు చేశారు. ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రూ.100 కోట్ల ముడుపుల ఆరోపణలపై అనిల్ దేశ్‌ముఖ్‌పై మానీలాండరింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) మేరకు కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు శుక్రవారం మంత్రి ఇండ్లపై దాడులు నిర్వహించారు. నాగ్‌పూర్‌లో, ముంబైలోని వర్లి ఏరియాలోని ఆయన నివాసాల్లో.. రెండు వేర్వేరు బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.
ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లోని సెంట్రల్ ఏజెన్సీ కార్యాలయంలో మాజీ మంత్రి ఇద్దరు సహాయకులను సుమారు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించిన తర్వాత వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాండే, పర్సనల్ అసిస్టెంట్ కుందన్ షిండేను అరెస్టు చేసినట్లు శనివారం అధికారులు తెలిపారు. విచారణ సమయంలో అధికారులకు ఇద్దరూ సహకరించలేదని పేర్కొన్నారు. వారిని ముంబైలోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి, కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని కోర్టును ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
నిద్ర సరిగ్గా పట్టట్లేదా ? కంటి చూపు దెబ్బతినొచ్చు జాగ్రత్త !
కూరలో కరివేపాకును తీసిపారేస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే అలా చేయరు
జూలై 5 వరకు లాక్డౌన్ పొడగింపు.. ఎక్కడంటే?
జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీస్ అధికారికి 22.5 ఏళ్ల జైలు
మరోసారి పెట్రోల్ ధరల పెంపు.. హైదరాబాద్‌లో ఎంత పెరిగిందంటే?
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద
పినాకా రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

