పినాకా రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
పినాకా రాకెట్ | ఒడిశా బాలాసోర్ తీరం చండీపూర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) వద్ద దేశీయంగా అభివృద్ధి చేసిన పినాకా రాకెట్ అడ్వాన్స్డ్ రేంజ్ వెర్షన్‌ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్డీఓ

భువనేశ్వర్ : ఒడిశా బాలాసోర్ తీరం చండీపూర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) వద్ద దేశీయంగా అభివృద్ధి చేసిన పినాకా రాకెట్ అడ్వాన్స్డ్ రేంజ్ వెర్షన్‌ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించిందని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 25 మెరుగైన పినాకా రాకెట్లను గురువారం, శుక్రవారాల్లో వేర్వేరు శ్రేణుల లక్ష్యాలకు వ్యతిరేకంగా వేగంగా పరీక్షించారు. మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్ (ఎంబీఆర్ఎల్) నుంచి 122 ఎంఎం కాలిబర్ రాకెట్లను ప్రయోగించినట్లు ఒక అధికారి తెలిపారు. ‘ప్రయోగ సమయంలో మిషన్ అన్ని లక్ష్యాలు నెరవేరాయి. పినాకా రాకెట్ సిస్టమ్ మెరుగైన శ్రేణి వర్షన్ 45 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను నాశనం చేయగలుతుంది’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాకెట్ వ్యవస్థను పూణేకు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏఆర్డీఈ), హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (హెచ్ఈఎంఆర్ఎల్) సంయుక్తంగా.. నాగ్‌పూర్‌లోని ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ సహకారంతో అభివృద్ధి చేశాయి. పినాకా అడ్వాన్స్డ్ రాకెట్లను విజయవంతంగా ప్రయోగించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, డీఆర్డీఓను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
నిద్ర సరిగ్గా పట్టట్లేదా ? కంటి చూపు దెబ్బతినొచ్చు జాగ్రత్త !
కూరలో కరివేపాకును తీసిపారేస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే అలా చేయరు
జూలై 5 వరకు లాక్డౌన్ పొడగింపు.. ఎక్కడంటే?
జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీస్ అధికారికి 22.5 ఏళ్ల జైలు
మరోసారి పెట్రోల్ ధరల పెంపు.. హైదరాబాద్‌లో ఎంత పెరిగిందంటే?
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Chandipur
- DRDO
- Odisha
- Pinaka Rocket
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

