జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీస్ అధికారికి 22.5 ఏళ్ల జైలు
జార్జి ఫ్లాయిడ్ హత్య కేసు | ఆఫ్రికా అమెరికన్ జార్లి ఫ్లాయిడ్ మరణానికి కారణమైన మాజీ పోలీస్ అధికారి డెరిక్ చౌవిన్‌కు మిన్నియా పొలిస్ కోర్టు ఇరవై రెండున్నరేళ్ల కారాగార శిక్ష విధించింది.

వాషింగ్టన్ : ఆఫ్రికా అమెరికన్ జార్లి ఫ్లాయిడ్ మరణానికి కారణమైన మాజీ పోలీస్ అధికారి డెరిక్ చౌవిన్‌కు మిన్నియా పొలిస్కోర్టు ఇరవైరెండున్నరేళ్ల కారాగార శిక్ష విధించింది. చౌవిన్ సత్ప్రవర్తనను కనబరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత అతనికి పెరోల్‌కు అనుమతించవచ్చని స్పష్టం చేసింది. ప్రతిపాదిత మార్గదర్శకాల్లో ఉన్నట్టు ఎక్కువ కాలం జైలు శిక్ష విధించాలన్న ప్రాసిక్యూటర్ విజ్ఞప్తికి స్పందిస్తూ ఈ విధంగా తీర్పునిచ్చింది. ‘శిక్ష భావోద్వేగం, సానుభూతిపై ఆధారపడి లేదు’ అని న్యాయమూర్తి పీటర్ కాహిల్ అన్నారు. ప్రాసిక్యూటర్లు 30 సంవత్సరాల శిక్షను కోరిన తర్వాత మిన్నియాపాలిస్ కోర్టు ఫ్లాయిడ్ హత్య దశాబ్దాలుగా జాతి న్యాయం కోసం అమెరికా చేసిన అతిపెద్ద ప్రదర్శనలకు దారితీసింది.
గత ఏడాదిగా ఘటనపై స్పందించని చౌవిన్ విచారణ సందర్భంగా ఫ్లాయిడ్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ‘ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలుపుతున్నాను. కాలం మీకు మనశ్శాంతి కలిగిస్తుందని ఆశిస్తున్నాను’ అని చౌవిన్ పేర్కొన్నాడు. అంతకుముందు.. విచారణను వాయిదా వేయాలన్న చౌవిన్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు తీర్పుపై ఫ్లాయిడ్ కుటుంబ న్యాయవాది స్పందిస్తూ ‘శిక్షను యూఎస్‌లో జాతి సయోధ్య వైపు చారిత్రాత్మక అడుగు’ అని పేర్కొన్నారు. పౌరహక్కుల కార్యకర్త అల్ షర్ప్టన్ మాట్లాడుతూ ‘కుటుంబ కోరుకున్నదాని కంటే తక్కువ శిక్ష అయినప్పటికీ.. ఇది జవాబుదారీతనం సందేశాన్ని’ పంపుతుందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
నిద్ర సరిగ్గా పట్టట్లేదా ? కంటి చూపు దెబ్బతినొచ్చు జాగ్రత్త !
కూరలో కరివేపాకును తీసిపారేస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే అలా చేయరు
జూలై 5 వరకు లాక్డౌన్ పొడగింపు.. ఎక్కడంటే?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

