సారే రావాలంటూ సైకిల్ యాత్ర!
రాష్ట్రంలో సాగునీటి కష్టాలు తొలగి, రైతుల పొలాలు మళ్లీ పచ్చగా కళకళలాడాలంటే కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గోదావరిఖనికి చెంది న 10 మంది యువకులు సైకిల్‌యాత్ర నిర్వహించారు.
- సాగునీటి కోసం గోదావరిఖని యువకుల తపన
- రాష్ట్రానికి కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్ష
- మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్ దాకా 8 రోజులు, 400 కిలోమీటర్ల ప్రయాణం
- కేసీఆర్‌ను కలిసిన గోదావరిఖని యువకులు
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సాగునీటి కష్టాలు తొలగి, రైతుల పొలాలు మళ్లీ పచ్చగా కళకళలాడాలంటే కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గోదావరిఖనికి చెంది న 10 మంది యువకులు సైకిల్‌యాత్ర నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్ వరకు 8 రోజులపాటు సుమా రు 400 కిలోమీటర్లు సైకిళ్లపై ప్రయాణించారు. యాత్రలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించారు. సాగునీరు, విద్యుత్తు కొరతతో ఎండిపోతున్న పంటలను చూశారు. రైతుల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావును ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో బుధవారం కలిసి, యాత్ర విశేషాలను వివరించారు. గోదావరిఖనికి చెందిన మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్, ఉప్పు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో 10 మంది యువకుల బృందం ఈ సైకిల్ యాత్ర నిర్వహించింది.
నీళ్లు లేక ఎండుతున్న పంటలు
కాళేశ్వరం కాలువలు, పంట పొలాల వెంట తమ యాత్ర సాగిందని వారు కేసీఆర్‌కు వివరించారు. ఉమ్మడి పాలనలో సాగునీటి కొరతతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ వ్యవసాయ రంగం, కేసీఆర్ పదేండ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పండుగలా మారిందని గుర్తుచేసుకొన్నారు. పొలాల్లో పసిడి పంటలు పండిన పరిస్థితి నుంచి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. యాత్ర సందర్భంగా బోర్లు ఎండిపోయి, సాగునీరు అందక, విద్యుత్తు సమస్యలతో పంటలు దెబ్బతినడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశామని కేసీఆర్‌కు వివరించారు. ఎండిపోయిన వరి కంకులను ఆయనకు చూపుతూ రైతుల దీనస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగంతోపాటు తెలంగాణలోని ఇతర రంగాలు కూడా కుదేలవుతున్నాయనే ఆవేదన ప్రజల్లో ఉన్నదని తెలిపారు.
కేసీఆర్‌తోనే వ్యవసాయానికి పూర్వవైభవం
తెలంగాణ వ్యవసాయం తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. సైకిల్ యాత్రలో తాము కలిసిన రైతులు, మహిళలు, వివిధ వృత్తులు, కులాలకు చెందిన సామాన్యులు తమ సమస్యలు, అభిప్రాయాలను పలువురు వెల్లడించారని యువకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నదని, రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తమవుతున్నదని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు, సాగునీటి కష్టాలు, ఎండిపోతున్న పంటల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ యాత్ర చేపట్టినట్టు తెలిపారు.
కేసీఆర్‌కు గోదావరి జలాల అందజేత
యాత్రలో భాగంగా సేకరించిన గోదావరి జలాలను ఆ యువకులు కేసీఆర్‌కు అందజేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి ఆకాంక్షలను తన దృష్టికి తీసుకొచ్చిన సైకిల్ యాత్ర బృందాన్ని కేసీఆర్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలు నెరవేరుతాయని స్పష్టంచేశారు. ఈ యాత్రలో కాసిపాక వాసు, ఆరేపల్లి సరీశ్, మేకల నవీన్‌కుమార్, పారిపల్లి అనిల్‌కుమార్, గుండెవేన శ్రీనివాస్‌యాదవ్, మంచినీళ్ల రాకేశ్, ముత్యం లక్ష్మణ్‌గౌడ్, అమ్ము కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

