సొంత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌పై మైక్రోసాఫ్ట్ మోజు.. అందుకోసమే..!

న్యూయార్క్: మిగతా టెక్ సంస్థల మాదిరిగా మైక్రోసాఫ్ట్ సైతం సొంతంగా మెసేజింగ్ వేదిక ఏర్పాటు కోసం కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ డిస్కార్డ్ ఇంక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్నది. ఈ డీల్ విలువ 1000 కోట్ల డాలర్లు ఉంటుందని మైక్రోసాఫ్ట్ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ న్యూస్ ఓ వార్తా కథనం ప్రచురించింది.

డిస్కార్డ్ టేకోవర్‌కు మైక్రోసాఫ్ట్ చర్చలు
డిస్కార్డ్ సైతం తమ సంస్థ కొనుగోలుకు ఆసక్తి, సామర్థ్యం గల సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నదని, ఆ జాబితాలో మైక్రోసాఫ్ట్ ఉన్నదని సన్నిహిత వర్గాల కథనం. మంగళవారం ఉదయం వెంచర్ బీట్ అనే మీడియా సంస్థ సైతం డిస్కార్డ్ విక్రయ చర్చలు తుది దశలో ఉన్నాయని పేర్కొంది. కానీ దీనిపై మైక్రోసాఫ్ట్, డిస్కార్డ్ స్పందించేందుకు ముందుకు రాలేదు.

700 కోట్ల డాలర్లుగా డిస్కార్డ్ వాల్యూ
గతేడాది డిసెంబర్లో డిస్కార్డ్ విలువ 700 కోట్ల డాలర్లుగా నిర్ణయించారు. యూజర్స్ గేమ్స్, డిస్కషన్స్, వర్చువల్ పార్టీల వంటి కార్యక్రమాలను డిస్కార్డ్ సమన్వయం చేస్తుంది. వీడియో గేమ్ ఆఫరింగ్స్‌ను బలోపేతం చేయడానికి గతేడాది జెనిమ్యాక్స్ మీడియాను 750 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది ఎక్స్‌బాక్స్ మేకర్.

కరోనా టైంలో వీడియో గేమ్స్‌పై నజర్
కరోనా మహమ్మారి వేళ లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోసం వీడియో గేమ్స్ ఆడటానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీనివల్ల గేమింగ్ కంపెనీలు పురోభివ్రుద్ధి చెందడానికి మార్గం సుగమం అయ్యింది.

2016 నుంచి మైక్రోసాఫ్ట్ ఇలా
2016లో లింక్డ్ఇన్ను 26.2 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ సొంతంగా సోషల్ మీడియా వేదికలను ఏర్పాటు చేసుకోవడంపై కేంద్రీకరించింది. ఇక షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికా ఆస్తులను కొనుగోలు చేయడానికి గతేడాది సెప్టెంబర్‌లో మైక్రోసాఫ్ట్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పినరెస్ట్ ఇంక్‌ను కొనుగోలు చేయడానికి మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపిందని ఫైనాన్సియల్ టైమ్స్ ఓ వార్తా కథనం ప్రచురించింది.
ఇవి కూడా చదవండి:
ఫేస్బుక్ కొత్త రిస్ట్‌బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
భారీగా తగ్గిన చమురు ధరలు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
కరోనా ఎఫెక్ట్..స్పీడ్ పెంచిన ఆచార్య టీం…!
‘మారటోరియం’ వడ్డీ మాఫీ..రూ.7500 కోట్ల భారం!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

