ఒకటి లేదా ఎక్కువ దీవులు లేదా ద్వీపభాగాలను కలిగి ఉన్న దేశాన్ని ద్వీపదేశం అంటారు. దీన్ని ఇంగ్లిష్‌లో ఐలాండ్ కంట్రీ అంటారు. కొన్ని ద్వీపదేశాలు, వాటి రాజధానులు తదితర వివరాలు నిపుణ పాఠకుల కోసం..
పలావ్ (Palau)
ఇది పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని ఒక ద్వీపదేశం. ఇది సుమారు 500 దీవులను కలిగి ఉంది.
ఇందులో అత్యధిక జనాభా కలిగిన ద్వీపం కొరోర్.
ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియాలతో సముద్ర సరిహద్దులను కలిగి ఉంది.
దీని రాజధాని జెరుల్ముద్. జనాభా 18,214
అధికార భాషలు: పలవాన్, ఇంగ్లిష్.
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు: జపనీస్, సోన్సోరోలిస్, టోబియన్
కరెన్సీ: యూఎస్ డాలర్.
అధ్యక్షుడు: సురాంజెల్ విప్స్
కిరిబతి
ఇది సెంట్రల్ పసిఫిక్‌లో గణతంత్ర ద్వీప రాజ్యం.
దీని రాజధాని తరావా.
అధికార భాషలు: ఇంగ్లిష్, గిల్బర్టీస్
కరెన్సీ: ఆస్ట్రేలియర్ డాలర్, కిరిబతి డాలర్.
జనాభా 1.19 లక్షలు.
అధ్యక్షుడు: టనేటి మామౌ
సింగపూర్
ఇది 704 చ.కి.మీ. (272 చ.మై) విస్తీర్ణంతో దక్షిణాసియాలోని చిన్న దేశం.
మతం: జనాభాలో 51 శాతం ప్రజలు బౌద్ధమతం, థాయిజం అవలంబిస్తున్నారు.
15 శాతం క్రిస్టియన్లు, 14 శాతం ముస్లింలు, 15 శాతం ఏ మతం అవలబించనివారు కాగా, మిగతా శాతం సిక్కు, హిందూ, బహాయి మతంవారు ఉన్నారు.
భాషలు: జాతీయ భాష మలయ్.
అధికార భాషలు: మలయ్, మాండరిన్, ఇంగ్లిష్, తమిళం.
జాతీయ గీతం: మజులా సింగపుర
జనాభా: సుమారు 56.9 లక్షలు
అధ్యక్షుడు: హలిమా యాకోబ్
పపువా న్యూగినియా
ఇది నైరుతి పసిఫిక్‌లోని ద్వీపదేశం.
ఇది 1949 జూలై 1న ఆస్ట్రేలియా నుంచి స్వాతంత్య్రం పొందింది.
రాజధాని: పోర్ట్ మోర్స్బి
ఇక్కడి ప్రజలు 850కి పైగా భాషలు మాట్లాడుతారు.
విస్తీర్ణం: 4,62,840 చ.కి.మీ.
జనాభా: సుమారు 89.5 లక్షలు.
కరెన్సీ: పపువా న్యూగినియా కినా (పీజీకే)
ప్రధానమంత్రి: జేమ్స్ మరపే.
నౌరూ
ఇది సెంట్రల్ పసిఫిక్‌లోని ద్వీప దేశం.
రాజధాని: యరెన్
జనాభా: 10,834
కరెన్సీ: ఆస్ట్రేలియన్ డాలర్
అధికార భాషలు: నౌరుయన్, ఇంగ్లిష్
అధ్యక్షుడు: లియోనెల్ అయింజిమీ
ఐస్లాండ్
ఇది నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలోని ద్వీప దేశం.
జనాభా: సుమారు 3.66 లక్షలు.
రాజధాని: రెక్జావిక్
కరెన్సీ: ఐస్‌ల్యాండ్ క్రోనా
అధికార భాష: ఐస్‌ల్యాండిక్
అధ్యక్షుడు: గుయోని థోరియోసియస్ జొహాన్నెసన్
న్యూజిలాండ్
ఇది పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి మూలన ఉన్నది.
రాజధాని: వెల్లింగ్టన్
పెద్ద నగరం: ఆక్లాండ్
అధికార భాషలు: మవోరి, ఇంగ్లిష్, న్యూజిలాండ్ సైన్ లాంగ్వేజ్.
జనాభా: సుమారు 50.8 లక్షలు
కరెన్సీ: న్యూజిలాండ్ డాలర్
ప్రధానమంత్రి: జసిండా అర్డెర్న్
ఫిజీ
ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో వసువటుకు తూర్పున, టోంగాకు పశ్చిమాన ఉంది.
అసలు పేరు: రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ ఐలాండ్స్
రాజధాని: సువా
అధికార భాషలు: ఫిజియన్, ఇంగ్లిష్, ఫిజి హిందీ
జనాభా: సుమారు 8.96 లక్షలు
కరెన్సీ: ఫిజియన్ డాలర్
అధ్యక్షుడు: విలియమే కటొనివెరె
సమోవా
ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నది.
రాజధాని: అపియా
అధికార భాషలు: సమోవా, ఇంగ్లిష్
జనాభా: సుమారు 1.98 లక్షలు
కరెన్సీ: సమోవాన్ టాల
ప్రధానమంత్రి: ఫ్లేమ్ నవోమి మట అఫా
సోలోమాన్ ఐలాండ్స్
ఇది పసిఫిక్ మహాసముద్రంలో పపువా న్యూగినియాకు తూర్పున, వనువటుకు వాయవ్య ప్రాంతంలో 900కి పైగా చిన్న ద్వీపాలను కలిగి ఉన్న దేశం.
రాజధాని: హొనియారా
జనాభా: 6.87 లక్షలు
అధికార భాష: ఇంగ్లిష్
కరెన్సీ: సోలోమన్ ఐలాండ్స్ డాలర్
ప్రధానమంత్రి: మనసెహ్ సొగొవరే
తువాలు
ఇది పసిఫిక్ మహాసముద్రంలో హవాయి, మధ్య ఆస్ట్రేలియాలకు తూర్పు ఈశాన్యం, నౌరు, కిరిబతిలకు పశ్చిమాన ఉంది.
రాజధాని: ఫునఫుటి
అధికార భాషలు: తువాలుయన్, ఇంగ్లిష్
దీని జనాభా 11,792
కరెన్సీ: తువాలుయన్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్
ప్రధానమంత్రి: కౌసీ నతనో
మార్షల్ ఐలాండ్స్
ఇది పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ సమీపంలో ఉన్న దేశం.
రాజధాని: మజురో
అధికార భాషలు: మార్షలీస్, ఇంగ్లిష్
జనాభా: 59,194
కరెన్సీ: యూఎస్ డాలర్
అధ్యక్షుడు: డేవిడ్ కబువా
ఇండోనేషియా
ఇండియా, పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఉంది.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప దేశం.
రాజధాని: జకార్త
అధికార భాష: ఇండోనేషియన్
జనాభా: 27.35 కోట్లు
కరెన్సీ: ఇండోనేషియా రూపియా
అధ్యక్షుడు: జొకొ విడొడొ
వనువటు
ఇది పసిఫిక్ మహాసముద్రంలో న్యూగినియాకు తూర్పున, సోలమన్ దీవులకు ఆగ్నేయ, ఫిజీకి పశ్చిమాన ఉంది.
రాజధాని: పోర్ట్ విలా
అధికార భాషలు: బిస్లామా, ఫ్రెంచ్, ఇంగ్లిష్
జనాభా: 3.07 లక్షలు
కరెన్సీ: వనువటు వటు
అధ్యక్షుడు: తలిస్ ఒబెడ్ మోసీ
ఫిలిప్పీన్స్
పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 7,641 ద్వీపాలను కలిగి ఉంది.
రాజధాని: మనీలా
అధికార భాషలు: ఫిలిపినో, ఇంగ్లిష్
జనాభా: 109,035,343
కరెన్సీ: పెసో
అధ్యక్షుడు: రొడింగో డుటెర్టీ
టోంగా
ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 169 ద్వీపాలను కలిగి ఉంది.
రాజధాని: నుకు అలోఫా
అధికార భాషలు: టోంగన్, ఇంగ్లిష్
జనాభా: 1.06 లక్షలు
కరెన్సీ: టోంగన్ పాంగా
రాజు: టెపౌ-6
మాల్టా
ఇది మధ్యదరా సముద్రంలో ఉంది.
రాజధాని: వలెట్టా
అధికార భాషలు: మాల్టీస్, మాల్టీస్ సైన్ లాంగ్వేజ్, ఇంగ్లిష్
జనాభా: 5.25 లక్షలు
కరెన్సీ: యూరో
ప్రెసిడెంట్: జార్జ్ వెల్లా
యునైటెడ్ కింగ్డమ్
అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర సముద్రం, ఇంగ్లిష్, ఐరిష్ సముద్రంతో ఆవరించి ఉన్న ద్వీప దేశం ఇది.
రాజధాని: లండన్
అధికార భాష: ఇంగ్లిష్
జనాభా: 6.72 కోట్లు
కరెన్సీ: పౌండ్ స్టెర్లింగ్
ప్రధానమంత్రి: బోరిస్ జాన్సన్
సైప్రస్
రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్‌గా పిలిచే ఈ దేశం మధ్యదరా సముద్రంలో ఉంది.
రాజధాని: నికోషియా
అధికార భాషలు: గ్రీక్, టర్కిష్
జనాభా: 12.1 లక్షలు
కరెన్సీ: యూరో
ప్రెసిడెంట్: నికోస్ అనస్టసియాడెస్
బ్రూనై
దీనిని స్టేట్ ఆఫ్ బ్రూనై దారుస్సలామ్ లేదా నేషన్ ఆఫ్ దారుస్సలామ్, ది అబోడ్ ఆఫ్ పీస్‌గా పిలుస్తారు.
ఇది మలేషియా, దక్షిణ చైనా సముద్రం (పసిఫిక్ మహాసముద్రంలోని కొంతభాగం)లో చైనాకు అభిముఖంగా ఉంది.
రాజధాని: బందర్ సెరి బెగవాన్
అధికార బాషలు: మలయ్, ఇంగ్లిష్
జనాభా: 4.37 లక్షలు
కరెన్సీ: బ్రూనై డాలర్
ప్రధానమంత్రి: హసనల్ బొల్కియా
బహ్రెయిన్
కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్ అని పిలిచే ఇది మిడిల్ ఈస్ట్‌లోని పర్షియన్ గల్ఫ్ పశ్చిమతీరంలో ఉంది.
రాజధాని: మనామా
అధికార భాష: అరబిక్
జనాభా: 17 లోలు
కరెన్సీ: బహ్రెయిన్ దినార్
ప్రధానమంత్రి: సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా
ఐర్లాండ్
రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌గా పిలిచే ఇది అట్లాంటిక్ మహాసముద్రం చుట్టూ, సెల్టిక్ సముద్రం దక్షిణాన, ఆగ్నేయ దిశగా సెయింట్ జార్జ్ చానల్, తూర్పున ఐరిష్ సముద్రంతో ఉంది.
రాజధాని: డబ్లిన్
అధికార భాషలు: ఐరిష్, ఇంగ్లిష్
జనాభా: 49.9 లక్షలు
కరెన్సీ: యూరో
ప్రెసిడెంట్: మైఖేల్ డి. హిగ్గిన్స్
న్యూ క్యాలిడోనియా
ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో చాలా ద్వీపాలను కలిగి ఉంది.
రాజధాని: నౌమియా
అధికార భాష: ఫ్రెంచ్
జనాభా: 2.72 లక్షలు
కరెన్సీ: సీఎఫ్‌పీ ఫ్రాంక్
ప్రెసిడెంట్: లూయిస్ మపౌ
ఆస్ట్రేలియా
ఇది భూగోళం దక్షిణ భాగంలో, పసిఫిక్, హిందూ మహాసముద్రాల మధ్య ఉంది.
రాజధాని: కాన్బెర్రా
అధికార భాష: ఇంగ్లిష్
జనాభా: 2.57 కోట్లు
కరెన్సీ: ఆస్ట్రేలియన్ డాలర్
ప్రధానమంత్రి: స్కాట్ మోరిసన్
నార్తర్న్ ఐర్లాండ్
ఇది యునైటెడ్ కింగ్డమ్లో భాగం.
రాజధాని: బెల్ఫ్రాస్ట్.
అధికార భాష: ఇంగ్లిష్. స్థానిక భాషలు ఐరిష్, ఉస్తెర్ స్కాట్స్.
జనాభా: 18.9 లక్షలు
కరెన్సీ: పౌండ్ స్టెర్లింగ్.
గువామ్
ఇది పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని, యూఎస్ స్టేట్స్ అన్ఇన్కార్పొరేటెడ్, వ్యవస్థీకృత భూభాగం.
రాజధాని: హగట్నా
అధికార భాషలు: ఇంగ్లిష్, చమొరో
జనాభా: 1.69 లక్షలు
కరెన్సీ: యూఎస్ డాలర్
ప్రెసిడెంట్: జో బైడెన్