డాక్టర్ నారాయణ రాజు మృతి బాధాకరం
బోయినపల్లి వినోద్ కుమార్ | కేంద్ర న్యాయ ( లెజిస్లేచర్ ) శాఖ కార్యదర్శి, ఇండియన్ లీగల్ సర్వీసెస్ అధికారి డాక్టర్ జీ. నారాయణ రాజు మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

హైదరాబాద్ : కేంద్ర న్యాయ ( లెజిస్లేచర్ ) శాఖ కార్యదర్శి, ఇండియన్ లీగల్ సర్వీసెస్ అధికారి డాక్టర్ జీ. నారాయణ రాజు మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ న్యాయ ( లెజిస్లేచర్ ) శాఖ ఉన్నతాధికారిగా ఉన్న నారాయణ రాజు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారని ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో కేంద్ర మంత్రులకు ఎప్పటికప్పుడు నారాయణ రాజు సూచనలు ఇచ్చేవారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల పెంపునకు అవకాశాలు ఉన్నాయని తన అభిప్రాయాలను కేంద్రానికి గట్టిగా వినిపించిన నారాయణ రాజు కరోనా బారిన పడి మృతి చెందడం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు కోసం రాజ్యసభ చైర్మన్, భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుతో తనతోపాటు రాజ్యసభలో టీఆర్ఎస్ సభా పక్ష నేత కే. కేశవరావు సమావేశమైన సందర్భంగా నారాయణ రాజు క్రియాశీలక పాత్రను పోషించి కేంద్ర న్యాయ ( లెజిస్లేచర్ ) శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారని వినోద్ కుమార్ వివరించారు.
నారాయణ రాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పాలమూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

