
బెల్గ్రేడ్: పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు తొలి పతకం ఖాయమైంది. మంగళవారం జరిగిన 54కిలోల క్వార్టర్స్ బౌట్లో యువ బాక్సర్ ఆకాశ్ కుమార్ 5-0 తేడాతో యోల్ ఫినోల్ రివాస్(వెనిజులా)పై అద్భుత విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లాడు. ఆది నుంచే పదునైన పంచ్లతో విరుచుకుపడిన ఆకాశ్ మెగాటోర్నీలో కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్నాడు. మరోవైపు నరేందర్ బెర్వాల్(92కి) 0-5తో మహమ్మద్ అబ్దుల్లాయెవ్ చేతిలో ఓడాడు.