ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. ప్రధాన నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. దీంతో మాతృభూమిపై మమకారంతో సామాన్యులు కూడా గన్ను పట్టుకుంటూ.. కదన రంగంలోకి దిగుతున్నారు. మొన్నటికి మొన్న ఓ మహిళా ఎంపీ అత్యాధునిక రైఫిల్‌తో కదన రంగంలోకి దిగడానికి రెడీగా ఉన్నానంటూ ఫొటో ట్వీట్ చేశారు. ఇప్పుడు.. ఉక్రెయిన్ బ్యూటీ కూడా గన్ను పట్టి.. కదన రంగంలోకి దిగుతానంటూ ప్రకటించింది. ఆమె పేరు అనాస్టాసియా లెన్నా. ఈమె ఉక్రెయిన్ బ్యూటీ క్వీన్. 2015 లో మిస్‌గ్రాండ్ ఉక్రెయిన్ను గెలుచుకుంది.
ఇప్పుడు ఈమె కూడా కదన రంగలోకి దిగడానికి రెడీ అయ్యింది. ఓ అత్యాధునిక గన్‌తో ఆమె ఫొటోను షేర్ చేసింది. అత్యంత గ్లామరస్ ఫీల్డ్‌ను గడ్డిపోచలా భావించి… సైన్యంలో చేరి.. మాతృభూమి కోసం యుద్ధం చేయడానికి రెడీ అయ్యింది. ఇలా ఆయుధాలను ఉపయోగించడం తనకు కొత్తేమీ కాదని కూడా ఆమె ప్రకటించింది. దేశాన్ని కాపాడుకోవడానికే తాను ఆయుధాన్ని చేతబట్టానని, ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకుంటామంటూ ఎవరైనా ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి వస్తే.. చావగొడతామని ఆమె తీవ్రంగా హెచ్చరించింది. అలాగే ప్రస్తుత అధ్యక్షుడు జెలెన్స్కీ అత్యంత ధీశాలి నేత అని, నిజాయితీ గలిగిన నేత అంటూ ఆమె ప్రశంసించారు.