Hit and Run | హైదరాబాద్: ఓఆర్ఆర్ (ORR) రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నందులాల్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడిని ఇన్నోవా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నందులాల్‌ను జైద్ షా ఖాద్రీ అనే విద్యార్థి ఆస్పపత్రికి తీసుకెళ్తున్నారు. మరో మహేంద్ర కార్ వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో నందులాల్ అక్కడికక్కడే మరణించాడు.
స్థానికులు తీవ్ర గాయాల పాలైన జైద్‌షా ఖాద్రీని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదం చేసి ఆపకుండా వెళ్లిపోయిన మహీంద్రా కార్ యజమాని, నడిపినది ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌గా గుర్తించారు. రాయదుర్గం (Rayadurg) పోలీసులు సందీప్‌ను అరెస్ట్ చేశారు.