Nepal Floods: ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
Nepal Floods: నువాకోట్ జిల్లాలోని ఓ ఇంట్లో 24 మంది మృతదేహాలను గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఆ శవాలు బయటపడ్డాయి. బేత్రావతి వద్ద ఉన్న ఇంట్లో ఆ మృతదేహాలను గుర్తించారు. ప్రస్తుతం గాలింపులు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
కాట్మాండు: నేపాల్‌లో బురదతో కూడిన వరద(Nepal Floods) విలయం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే శక్తివంతమైన ఆ బురద ధాటికి అనేక ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఆ శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. కొన్ని ఇండ్లల్లో మృతదేహాలను వెలికి తీస్తున్నారు. నువాకోట్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. బిదుర్ మున్సిపాల్టీలోని బేత్రావతి వద్ద ఓ ఇంట్లో 24 మంది మృతదేహాలను బయటకు తీశారు. హెలికాప్టర్ల సహాయంతో నేపాల్ ఆర్మీ గాలింపు చర్యలు చేపడుతున్నది. అయితే వరద ప్రభావానికి గురైన ఓ ఇంటిని పరిశీలిస్తున్న సమయంలో.. ఆ ఇంట్లో అనూహ్య రీతిలో 24 మంది శవాలను గుర్తించారు. ఈ విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ బిపిన్ రెజ్మీ కన్ఫర్మ్ చేశారు.
ప్రస్తుతం ఆ ఇంట్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాల తుది సంఖ్య తర్వాత వెల్లడించనున్నట్లు తెలిపారు. అయితే ఆ ఇళ్లు ఎవరికి చెందినదో తెలియదు. దాని ఓనర్ ఎవరో తెలియదు. స్థానిక అధికారుల సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. బహుశా ఆ బిల్డింగ్ ఓ హోటల్ లేదా గెస్ట్ హౌజ్ అయి ఉంటుందని అంచాన వేస్తున్నారు. కానీ దీన్ని ఎవరూ వెరిఫై చేయలేదు. ఇకే ఇంట్లో ఎందుకు ఇంత మంది ఉన్నారో కనుక్కునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 26వ తేదీన సంభవించిన వరదల్లో మృతుల సంఖ్య వెయ్యి దాటింది.
Twenty-four bodies have been recovered from inside a single house in a flood-affected region of Nuwakot.
District Police Office Nuwakot SP Bipin Regmi informed that 24 bodies were found on Monday inside a home located in Betrawati, Vidur Municipality-10.#NepaleseCity pic.twitter.com/cpHODqnswm
— Nepalese City (@nepalesecity) September 1, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

