ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్రం భగ్గుమంది. ప్రాణత్యాగాలు చేసి మరి సాధించుకున్న రాష్ట్రంపై విషం చిమ్మిన మోదీ వైఖరిని ఎండగడుతూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని యావత్ తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. ఈ క్రమంలోనే మంగళవారం తెలంగాణ మొత్తం నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలతో అట్టుడికిపోయింది. మోదీ డౌన్‌డౌన్.. జైతెలంగాణ అంటూ నినాదాలు మార్మోగిపోయాయి. టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి పైసా ఇవ్వరు కానీ స్వంతకాళ్లపై నిలబడి ఎదుగుతున్న తెలంగాణపై విషం చిమ్ముతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. [gallery columns="1" size="full" ids="444277,444278,444279,444280,444281,444283,444284,444285,444286,444287,444288,444289,444290,444291,444292,444293,444294,444295,444296,444297"]