Snowfall in Sahara desert | నిప్పుల కొలిమిలా మండిపోయే సహారా ఎడారి ఐస్ ముక్కలా మారిపోయింది. 60 డిగ్రీలకు తగ్గని ఉష్ణోగ్రతతో మండే ఆ ప్రాంతం హిమతుషారాలతో ముద్దయిపోయింది. ఆఫ్రికా దేశం అల్జీరియాలోని సహారా ఎడారిలో గత రెండు మూడు రోజులుగా మంచు కురుస్తున్నది. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా మైనస్ డిగ్రీల్లోకి వెళ్లిపోయాయి. ఇసుక తిన్నెలపై మంచు ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. సహారా ఎడారిలో మంచు కురవడం ఇదే తొలిసారి కాదు. గడిచిన 42 ఏండ్లలో ఐదుసార్లు.. 1979, 2016, 2018, 2021 సంవత్సరాల్లో అక్కడ మంచు కురిసింది.