crowd at Delhi airport | ఈ ఫొటో చూస్తుంటే పండుగ సమయాల్లో రైల్వే స్టేషన్ల వద్ద కనిపించే రద్దీలా ఉంది కదూ.. కానీ ఇది ఢిల్లీ విమానాశ్రయం. ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్రం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. కరోనా పరీక్ష చేయించుకుని ఫలితం వచ్చే వరకు గంటల తరబడి అక్కడే వేచి ఉండాల్సి రావడంతో ఆదివారం ఢిల్లీ విమానాశ్రయంలో ఇలా ప్రయాణికులు భారీ సంఖ్యలో ఒక చోట కనిపించారు.