HomeNews-in-picPalamuru Has Completely Changed After Telangana Formation
నాడు కరువుతో కటకట.. నేడు సిరుల పంట..
palamuru
2/6
Palamuru | నాడు కరువుతో కటకటలాడిన నేల ఇప్పుడు సిరులు కురిపిస్తున్నది. ఒకప్పుడు పనిలేక వలసలకు ఆవాసంగా మారిన ఆ ప్రాంతం.. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల వారికి సైతం ఉపాధి కల్పిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన అభివృద్ధి పనులతో పాలమూరు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జోగులాంబ గద్వాల జిల్లాకు తుమ్మిళ్ల ప్రాజెక్టు రావడంతో అలంపూర్ నియోజకవర్గంలో నీటి కొరత తీరి.. మిర్చి పంట సిరులు కురిపిస్తున్నది. పొరుగు రాష్ట్రమైన ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి దాదాపు రోజుకు పది నుంచి ఇరవై మంది కూలీలు ఇక్కడికి ఉపాధి కోసం వస్తున్నారు. ఇలా మిర్చి తోటలో పనిచేస్తున్నారు.