జొన్నకర్ర సాధారణంగా అయిదు నుంచి ఆరడుగులు పెరుగుతుంది. కానీ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రామచంద్రపురానికి చెందిన బొలిశెట్టి సైదులు ఇంట్లో మొలిచిన జొన్నకర్ర 17 అడుగుల ఎత్తు పెరిగింది. పోషకాలు, జన్యుపరమైన మార్పులతో కొన్ని మొక్కలు ఇలా ఏపుగా పెరుగతాయని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త దొంగరి నరేశ్ తెలిపారు.