ప్రమాదకరమైన ఈ ఫీట్లు చూశారా ! ఇవేవో సరదాకి చేస్తున్న విన్యాసాలు కాదు ! అదే వాళ్ల జీవనాధారం. వాళ్లు చేసే విన్యాసాలు వీక్షించి కాలక్షేపం పొందిన జనాలు ఇచ్చే నాలుగు పైసలతోనే పూట గడుస్తుంది. అందుకే జనాలిచ్చే చిల్లర డబ్బుల కోసం ప్రాణాలకు తెగించి మరీ ఇలాంటి సాహసోపేతమైన విన్యాసాలు చేస్తున్నారు. పొట్టకూటి కోసం బీదర్ నుంచి వచ్చిన ఓ కుటుంబం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బుధవారం ఇలా ప్రమాదకరమైన ఫీట్లు చేస్తూ నమస్తే తెలంగాణ కెమెరాకు కనిపించింది.