75th independence day | 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని 7500 చదరపు అడుగులతో త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. విక్టోరియా మెమోరియల్ హాల్ వద్ద ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ మువన్నెల జెండాను ఎగురవేశారు.