Rave Parties: రేవ్ పార్టీలకు పాము విషాన్ని తీసుకొచ్చా.. తప్పును ఒప్పుకున్న యూట్యూబర్ యాదవ్
Rave Parties: రేవ్ పార్టీలకు పాములతో పాటు పాము విషాన్ని తీసుకువచ్చినట్లు యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఒప్పుకున్నాడు. గత ఏడాది రేవ్ పార్టీలకు పాము విషం సరఫరా చేస్తూ దొరికిన వారితోనూ తనకు సంబంధాలు ఉన్నట్లు యాదవ్ అంగీకరించాడు.
న్యూఢిల్లీ: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ ఎల్విష్ యాదవ్ తన తప్పును అంగీకరించాడు. రేవ్ పార్టీలకు(Rave Parties) పాములతో పాటు పాము విషాన్ని ఆర్గనైజ్ చేసినట్లు ఒప్పుకున్నాడు. పాము విషం దొరికిన కేసులో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌ను ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది పాము విషం సరఫరా చేస్తూ దొరికిన వారితోనూ తనకు సంబంధాలు ఉన్నట్లు యాదవ్ అంగీకరించాడు.
26 ఏళ్ల ఎల్విష్ తొలుత స్నేక్ వినోమ్ కేసులో తనకు పాత్ర లేదని చెప్పాడు. కానీ వేర్వేరు రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేసినట్లు అతను ఒప్పకున్నాడు. ఇతర సరఫరాదారులతోనూ టచ్‌లో ఉన్నట్లు చెప్పాడు. 14 రోజుల జుడిషియల్ కస్టడీలోకి అతన్ని తీసుకున్నారు.
యాదవ్‌పై వైల్డ్‌లైఫ్ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాఫిక్ పదార్ధాలు కలిగి ఉన్న కేసులో అతన్ని విచారిస్తున్నారు. సెక్షన్ 29 కింద అతనికి కఠిన శిక్ష విధించనున్నారు. ఈ కేసులో బెయిల్ దొరకడం కష్టమే. వీడియో షూట్స్ కోసం ఎల్విష్ యాదవ్.. తన వద్ద ఉన్న పాములను వాడేవాడు. బాలీవుడ్ గాయకుడు ఫజిల్పురియా తన పార్టీలకు పాములను ఆర్గనైజ్ చేసేవాడని గతంలో ఎల్విష్యాదవ్ తెలిపాడు.
ఇటీవల నోయిడాలోని జరిగిన ఓ రేవ్ పార్టీలో పోలీసులు అయిదుగుర్ని అరెస్టు చేశారు. దాంట్లో నలుగురు పాములు ఆడించేవాళ్లు ఉన్నారు. 9 పాములతో పాటు స్నేక్ విషాన్ని కూడా సీజ్ చేశారు. ఓ ఎన్జీవో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వాళ్లను పట్టుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

