న్యూఢిల్లీ: షార్ప్‌గా ఉన్న ఇనుప రాడ్ల మధ్యలో నిల్చొని డేంజర్ స్టంట్ చేసేందుకు యువకుడు ప్రయత్నించాడు. (Youth Dangerous Stunt) అయితే తల్లి వారించినప్పటికీ అతడు పట్టించుకోలేదు. అక్కడి నుంచి జంప్ చేయడంతో అతడి బూటు ఇనుప రాడ్లోకి దిగింది. ఇది చూసి కర్రతో యువకుడ్ని కొట్టేందుకు తల్లి ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో రీల్ కోసం ఒక యువకుడు ప్రయత్నించాడు. దీని కోసం రిస్కీ స్టంట్ చేశాడు. ఒక టైరు మధ్యలో, చుట్టూ సూదులుగా ఉన్న ఇనుప రాడ్లు ఉంచాడు. మధ్యలో ఉన్న ఇటుకలపై నిల్చొన్నాడు. అక్కడి నుంచి బయటకు జంప్ చేశాడు. అయితే టైరు మధ్యలో ఉన్న పదునైన ఇనుప రాడ్లోకి అతడి షూ దిగింది. దీంతో ఆ యువకుడు గాయపడ్డాడు.
కాగా, ఈ స్టంట్ చేస్తుండగా ఆ యువకుడి తల్లి వెనుకే ఉంది. అతడ్ని వారించేందుకు ఆమె ప్రయత్నించింది. చేతిలో కర్ర పట్టుకుని కొట్టేందుకు అతడి వద్దకు వచ్చింది. అంతలోనే యువకుడి స్టంట్ పూర్తయ్యింది. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో అన్నది తెలియలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు అతడి స్టంట్‌పై మండిపడ్డారు.
VIP bricks give it the touch 😎 pic.twitter.com/kxLPvT925k
— Censored Tube (@CensoredTube) October 23, 2024