Yogi Adityanath | ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఉచిత బస్సు సర్వీస్.. కానీ, వారికి మాత్రమే.. క్యాబినెట్ ఆమోదం
Yogi Adityanath : తెలంగాణ, ఏపీ, కర్ణాటకలలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు స్కీం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లోనూ అమలులోకి రానుంది. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ క్యాబినెట్ ఈ పథకానికి మంగళవారం ఆమోదం తెలిపింది.
Yogi Adityanath : తెలంగాణ, ఏపీ, కర్ణాటకలలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు స్కీం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లోనూ అమలులోకి రానుంది. ఈ మేరకు ఉత్తర ప్రభుత్వ క్యాబినెట్ ఈ పథకానికి మంగళవారం ఆమోదం తెలిపింది. అయితే, ఇది 60 సంవత్సరాలు దాటిన మహిళలకు మాత్రమే. లోకమాత అహిల్యాబాయ్ మాతృశక్తి యోజన పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని యోగి ఆదిథ్యనాథ్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నట్లు అందరు మహిళలకు కాకుండా.. 60 సంవత్సరాలు దాటిన మహిళలకు మాత్రమే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ పథకం జీవితాంతం వర్తిస్తుంది. ఉత్తర ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్టీసీ) బస్సులలో ఈ పథకం అమలవుతుంది. ఈ విషయాన్ని యూపీ రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బస్సుల్లో ఈ పథకం అమలవుతుందన్నారు.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని కోటి మందికిపైగా మహిళలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అర్హులైన మహిళలు వోటర్ ఐడీ, ఆధార్ సహా వయసును సూచించే ఇతర ప్రభుత్వ, అధికార గుర్తింపు కార్డులను చూపించి ఈ పథకాన్ని పొందవచ్చు. ఈ పథకాన్ని రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న కానుకగా ప్రభుత్వం అభివర్ణించింది. వృద్ధులకు ప్రయాణ ఖర్చుల భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు గంగా ఎక్స్‌ప్రెస్ వేను యూపీలోని హరిద్వార్ వరకు పొడిగించేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.10,761 కోట్లు ఖర్చు కానున్నాయి. దీని ద్వారా బిజ్నూర్ నుంచి హరిద్వార్‌కు రవాణా మెరుగవుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

