లక్నో: ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. యోగీ ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఇప్పటికే 53 మంది ఉండగా.. కొత్తగా మరో ఆరుగురిని తీసుకున్నారు. కొత్త మంత్రులతో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. లక్నోలోని రాజ్భవన్లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన ఆరుగురిలో ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద కూడా ఉన్నారు.
జితిన్ ప్రసాద జూన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. యూపీలో బ్రాహ్మణ ఓటు బ్యాంకు 13 శాతం ఉంది. ఈ నేపథ్యంలో తాజా మంత్రివర్గ విస్తరణలో యోగీ ఆదిత్యనాథ్ జితిన్ ప్రసాదకు చోటు కల్పించారు. జితిన్ ప్రసాదతోపాటు ఎమ్మెల్యేలు ఛతర్పాల్ గంగ్వార్, పాల్తురామ్, సంగీత బల్వంత్, సంజీవ్ కుమార్, దినేష్ కార్తీక్, ధరమ్వీర్ ప్రజాపతి యూపీ నూతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
#WATCH | BJP leader Jitin Prasada takes oath as a minister in the Uttar Pradesh Government, at a ceremony in Lucknow
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 26, 2021
Prasada joined the BJP from Congress in June this year pic.twitter.com/qlnnbp6qOL
#WATCH | MLA Chhatarpal Gangwar takes oath as a minister of state (MoS) in the Uttar Pradesh Government at a ceremony in Lucknow pic.twitter.com/BbpnJeHTs9
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 26, 2021
Lucknow: BJP MLAs Palturam, Sangeeta Balwant, Sanjeev Kumar, and Dinesh Khatik take oath as ministers of state (MoS) in the Uttar Pradesh Govt pic.twitter.com/4JlLAvponc
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 26, 2021