న్యూఢిల్లీ : తనను పదవి నుంచి తొలగించాలని సిఫారసు చేసిన విచారణ ప్యానెల్ నివేదికను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్లో తన పేరును గోప్యంగా ఉంచారు.
ఆయన అభ్యర్థన మేరకు సోమవారం ఈ కేసును కాజ్ లిస్ట్‌లో ‘ఎక్స్ఎక్స్ఎక్స్ వర్సెస్ ది యూనియన్ ఆఫ్ ఇండియా’గా సుప్రీంంకోర్ట్ పేర్కొంది. పిటిషనర్ల గుర్తింపును గోప్యంగా ఉంచేందుకు ‘ఎక్స్ఎక్స్ఎక్స్’ అని ఉపయోగించడం అసాధారణమేమీ కాదు.