Twitter Down | న్యూఢిల్లీ : మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ఎక్స్ (గతంలో ట్విటర్) సోమవారం మూడుసార్లు సాంకేతిక లోపాలతో డౌన్ అయింది. దీంతో యూజర్లు, మరీ ముఖ్యంగా బిజినెస్, మార్కెటింగ్‌ల కోసం ఈ వేదికను ఉపయోగించుకుంటున్నవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ ఆవేదనను ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.
వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించి ఔటేజ్‌లను ట్రాక్ చేసే డౌన్‌డిటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎక్స్ మొదటిసారి డౌన్ అవగా, కాసేపట్లోనే సేవలు పునఃప్రారంభమయ్యాయి. మళ్లీ రెండోసారి సాయంత్రం 7.32 గంటలకు, మూడోసారి రాత్రి 9.32 గంటలకు డౌన్ అయింది.