న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో జూలై 7న నిర్మించిన కరోనా మాత గుడిని కూల్చివేయడంపై దీపమాల శ్రీవాస్తవ అనే మహిళ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విధులకు ఆటంకం కలిగించారని పిటిషనర్‌కు రూ.5వేల జరిమానా విధించింది. వివాదాస్పద స్థలంలో గుడిని ఏకపక్షంగా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది. లోకేశ్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి జుహీశుక్లాపూర్ గ్రామస్థుల దగ్గర విరాళాలు సేకరించి వివాదాస్పద స్థలంలో గుడిని నిర్మించారు. దీనిపై నగేశ్ కుమార్ శ్రీవాస్తవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థలాన్ని ఆక్రమించుకొనేందుకే గుడి కట్టారని తెలిపారు. జూలై 11న పోలీసులు గుడిని కూల్చివేశారు.