ఖర్ఖోడా: శివరాత్రి సందర్భంగా జాతరలో నిర్వహించిన రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఓ రెజ్లర్(Wrestler Shot Dead ) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని ఖర్గోడా జిల్లాలో ఉన్న కుండల్ గ్రామంలో జరిగింది. తూపాకీ కాల్పుల్లో మృతిచెందిన రెజ్లర్‌ను 35 ఏళ్ల రాకేశ్‌గా గుర్తించారు. అతను సోతి గ్రామస్థుడు. రోహ్తక్లో కుటుంబంతో అతను జీవిస్తున్నాడు. సోతి గ్రామంలో అతను ఓ రెజ్లింగ్ అకాడమీ నడిపిస్తున్నాడు.
కుటుంబానికి చెందిన పాత కక్షలే అతన్ని బలి తీసుకున్నట్లు రెజ్లర్ రాకేశ్ మామ చాంద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమి వివాదం అంశంలో మనోజ్ అనే వ్యక్తితో గొడవలు ఉన్నాయని, గతంలోనూ మనోజ్ మరో వ్యక్తితో కలిసి రాకేశ్‌పై అటాక్ చేసినట్లు చెప్పాడు. శివరాత్రి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు తన కుమారుడు అమృత్, ఇతర ప్లేయర్లతో కలిసి రాకేశ్ వెళ్లాడు.
కొడుకు అమృత్ బౌట్ ముగిసిన తర్వాత కారు ఎక్కేందుకు వెళ్తున్న సమయంలో.. రాకేశ్‌పై అటాక్ జరిగినట్లు ఫిర్యాదు చేశారు. మనోజ్, సాహిల్.. పిస్తోళ్లతో వచ్చిన రాకేశ్‌పై ఫైరింగ్ జరిపారు. ఆ టైంలో రోడ్డుపైకి పరుగెత్తేందుకు అతను ప్రయత్నించాడు. అయితే చేజింగ్ చేసి మరీ రాకేశ్‌ను షూట్ చేశారు. బుల్లెట్ గాయాలైన అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాకేశ్ శరీరంలోకి 8 బుల్లెట్లు దిగాయి. సోనిపట్ సివిల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.