Billionaires | ఫోర్బ్స్ బిలియనీర్స్.. జాబితాలో 229 మంది భారతీయులు..!
Billionaires | ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపాయి విలువ (Rupee value) క్షీణించినప్పటికీ భారత బిలియనీర్లు (Indian Billionaires) సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా-2026 ప్రకారం.. భారత్ నుంచి రికార్డు స్థాయిలో 229 మంది జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Billionaires : ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపాయి విలువ (Rupee value) క్షీణించినప్పటికీ భారత బిలియనీర్లు (Indian Billionaires) సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా-2026 ప్రకారం.. భారత్ నుంచి రికార్డు స్థాయిలో 229 మంది జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరి మొత్తం ఆస్తుల విలువ తొలిసారి లక్ష కోట్ల డాలర్ల మార్కును దాటడం విశేషం. ఈసారి రికార్డు స్థాయిలో 30 మంది కొత్తవారు ఈ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చారు. భారత్‌లోనే కాకుండా ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
మొత్తం 99.7 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన దేశంలో మొదటి స్థానంలో ఉండగా మౌలిక సదుపాయాల రంగ దిగ్గజం గౌతమ్ అదానీ 63.8 బిలియన్ డాలర్ల ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ఈ రెండు గ్రూపులు కలిపి ఏకంగా 210 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఇక ఓపీ జిందాల్ గ్రూప్ అధినేత్రి సావిత్రి జిందాల్ 39.1 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు. ఓవరాల్‌గా ఆమెకు మూడో స్థానం దక్కింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ 14.4 బిలియన్ డాలర్ల ఆస్తితో పదో స్థానంలో నిలిచి ఈ టాప్ గ్రూపులోకి ప్రవేశించారు. భారతీయ ఎడ్టెక్ రంగంలో ఈసారి సరికొత్త సంచలనం నమోదైంది. ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ‘ఫిజిక్స్ వాలా’ కో-ఫౌండర్లు అలఖ్ పాండే, ప్రతీక్ బూబ్ ఈసారి బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించారు. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన తమ కంపెనీ ఐపీఓ సూపర్ హిట్ కావడంతో ఈ ఇద్దరు కుబేరుల క్లబ్‌లోకి అడుగుపెట్టారు.
ఇక ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా అరవింద్ శ్రీనివాస్ (31) రికార్డు సృష్టించారు. జెఫ్ బెజోస్ మద్దతుతో నడుస్తున్న ‘పెర్ప్లెక్సిటీ’ ఏఐ సెర్చ్ స్టార్టప్ కో-ఫౌండర్ అయిన ఈయన శాన్ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. కొన్నేళ్ల విరామం తర్వాత ‘పేటీఎమ్’ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మళ్లీ బిలియనీర్ల జాబితాలోకి పునరాగమనం చేశారు. మరోవైపు ‘ఓలా క్యాబ్స్’ ఫౌండర్ భవీష్ అగర్వాల్‌తోపాటు మరో ఏడుగురు ఈసారి బిలియనీర్ల హోదాను కోల్పోయారు.
భారత టాప్-10 బిలియనీర్లు వీళ్లే..
1. ముకేశ్ అంబానీ – 99.7 బిలియన్ డాలర్లు, 2. గౌతమ్ అదానీ – 63.8 బిలియన్ డాలర్లు, 3. సావిత్రి జిందాల్ – 39.1 బిలియన్ డాలర్లు, 4. లక్ష్మీ మిట్టల్ – 31.0 బిలియన్ డాలర్లు, 5. శివ్ నాడార్ – 30.9 బిలియన్ డాలర్లు, 6. సైరస్ పూనావాలా – 27.0 బిలియన్ డాలర్లు, 7. దిలీప్ సంఘ్వీ – 25.6 బిలియన్ డాలర్లు, 8. కుమార్ బిర్లా – 21.1 బిలియన్ డాలర్లు, 9. రాధాకిషన్ దమానీ – 15.7 బిలియన్ డాలర్లు, 10. ఉదయ్ కోటక్ – 14.4 బిలియన్ డాలర్లు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

